సచివాలయంలో అక్టోబర్ 10 ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
- సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం
- చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం
- 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న కేబినెట్
- రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదన
- దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
- పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం
- దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం
- రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం
- రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం
- మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం