Big Update: 70 ఏళ్లు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా

Big Update: 70 ఏళ్లు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా

కేంద్ర క్యాబినెట్‌ బుధవారం అనగా సెప్టెంబర్ 11న కీలక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్‌ (Ayushman Bharat) ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు.

ధనిక పేద తేడా లేకుండా 70 ఏళ్ళు నిండిన అందరికీ ఆరోగ్య బీమా

70 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్ర ప్రశంసలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 70 ఏళ్ళ నిండిన వారి సామాజిక ఆర్థిక పరిస్థితి తో సంబంధం లేకుండా అందరికీ ఈ భీమా వర్తింపచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ది కలుగుతుంది. తద్వారా ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పించారు. ఒక వేళ ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్నచో అటువంటి ఇళ్లలో ఉన్నటువంటి సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు ఏదైనా (కొనసాగిస్తున్న బీమా లేదా పీఎంజేఏవై) ఎంచుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య యోజన (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌ లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితంగా పొందవచ్చు. అయితే 70 ఏళ్లు పైబడిన వారికి వారి ఆర్థిక స్థోమత తో సంబంధం లేకుండా తాజా నిర్ణయం తో ఎవరైనా ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.

You cannot copy content of this page