నేడే పెన్షన్ పంపిణీ, ఆగస్టు పెన్షన్ వివరాలు

నేడే పెన్షన్ పంపిణీ, ఆగస్టు పెన్షన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ కొనసాగుతుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అమౌంట్ ను అందించడం జరుగుతుంది.

ఈనెల పెన్షన్ అమౌంట్ ఎంత అంటే [ August Pension Amount]

గత జూలై నెలలో పెన్షన్ పంపిణీ లో భాగంగా వృద్ధులు, ఒంటరి మహిళలు వితంతువులు సహా 12 రకాల పెన్షన్ లబ్ధిదారులకు 7000 రూపాయలను బకాయిలతో కలిపి రాష్ట్రప్రభుత్వం అందించడం జరిగింది.

అయితే గత నెల బకాయిలను కలిపి 7000 అందించారు. ఈ నెల నుంచి ఎటువంటి బకాయిలు లేవు కాబట్టి ఇకపై నాలుగు వేల రూపాయలను ప్రతినెలా అందించడం జరుగుతుంది. దివ్యాంగులకు 6000 రూపాయలు అందించడం జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి 64.82 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 2737.41 కోట్లను పెన్షన్ కింద పంపిణీ చేస్తుంది.

ఏ కేటగిరిలో వారికి ఎంత పెన్షన్ అనేది మీరు కింది లింక్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పెన్షన్ పంపిణీ సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా కింది లింక్ లో ఇవ్వబడింది.

మడకశిర లో స్వయంగా ముఖ్యమంత్రి పంపిణీ

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.

గత నెలలో రికార్డు స్థాయిలో ఒకటో తేదీనే సాయంత్రానికి 90% పైగా పెన్షన్ పంపిణీ పూర్తి అవ్వడం జరిగింది. అదే మాదిరి ఈ నెల కూడా ఒకటవ తేదీనే నూరు శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పెన్షన్ పంపిణీ గైడ్లైన్స్ ని కూడా విడుదల చేసింది. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ గైడ్లైన్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

You cannot copy content of this page