ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆసరా పేమెంట్ వివరాలు తెలుసుకొనే విధానం
Step 1 : ముందుగా అన్ని స్టెప్స్ చదివి కింది స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి ..
Link : ఆసరా స్టేటస్ లింక్
Step 2: ఇందులో మీ జిల్లా , మండలం, గ్రామం ఎంచుకోండి.
Step 3: తర్వాత outstanding పైన సెలెక్ట్ చేయండి.
కింది విధంగా అన్ని ఓపెన్ లోన్స్ చూపిస్తాయి. ఇందులో loan Issued date 2019 ఏప్రిల్ 11 లోపు ఉండీ, ఆ డేట్ నాటికి ఇంకా చెల్లించాల్సిన అమౌంట్ కి ఆసరా వర్తిస్తుంది.
ఒకవేళ మీ లోన్ 2019 ఏప్రిల్ నెల తర్వాత క్లోజ్ అయినట్లయితే , అప్పటివరకు outstanding అమౌంట్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
అర్హత ఉన్న లోన్‌లకు మీ ప్రాంతంలో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత మీ పొదుపు ఖాతాలో అమౌంట్ జమవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపు మీ ప్రాంతంలో పంపిణీ తేదీ ని అనుసరించి అమౌంట్ జమ కానుంది.
Note: పై విధంగా గ్రామాల వారీగా డేటా చూడవచ్చు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి డేటా కింది లింక్ లో ఉంటుంది , అయితే పట్టణ ప్రాంతాల డేటా లాగిన్ లో నే లేటెస్ట్ డేటా ఉంటుంది.
Jagananna Vidya Deevena (JVD) Payment Status Check 2024 Process
Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
Step 2. పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి
పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.