రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు వాలంటీర్లకు ముఖ్య గమనిక. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసినటువంటి వాలంటీర్ గ్రూపులను తక్షణమే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి డిలీట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ ను క్రియేట్ చేయడం జరిగింది. వీటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి గ్రూపులను ఆగస్టు 5 సాయంత్రం 5 గంటలకల్లా డిలీట్ చేయాలని ఆదేశించింది.
అదేవిధంగా అటువంటి గ్రూప్స్ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని, అందుకు అనుగుణంగా వారికి అవగాహన కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కింద డౌన్లోడ్ చేసుకోగలరు.
#GSWS Department – Grama /Ward Volunteers – Request to delete groups created by Volunteers in certain messaging platforms and sensitize Citizens to exit such groups– certain instructions issued