వాలంటీర్లకు గుడ్ న్యూస్, ఏపి లో సేవ అవార్డుల అమౌంట్ రెట్టింపు

వాలంటీర్లకు గుడ్ న్యూస్, ఏపి లో సేవ అవార్డుల అమౌంట్ రెట్టింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవ పురస్కారాలకు సంబంధించినటువంటి అమౌంట్ ను రెట్టింపు చేయనున్నట్లు సమాచారం.

Volunteer Awards 2024 – వాలంటీర్ సేవా అవార్డుల నగదు రెట్టింపు

ప్రతి ఏటా నగదు పురస్కారాలు కింద గ్రామ వార్డు వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 250 కోట్ల రూపాయల నిధులను ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లకు రెట్టింపు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ కనబరిచినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా సేవ వజ్ర, సేవ రత్న,  సేవ మిత్రా అనే మూడు కేటగిరీలలో  వాలంటీర్లకు అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు సేవా వజ్ర కింద 30 వేల రూపాయలు, సేవా రత్న కింద 20 వేల రూపాయలు, సేవా మిత్ర కింద పదివేల రూపాయలు  వాలంటీర్లకు అందజేస్తుండగా ప్రస్తుతం ఈ అమౌంట్ రెట్టింపు కానుంది.

రెట్టింపు చేసిన అమౌంట్ ప్రకారం, కింది విధంగా అవార్డు అమౌంట్ ఉండనుంది.

  • సేవ వజ్ర – ₹60000 రూపాయలు
  • సేవ రత్న – ₹30000 రూపాయలు
  • సేవ మిత్ర – ₹20000 రూపాయలు

ఈ అమౌంట్ రెట్టింపు కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది

మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

వాలంటీర్ అవార్డులు ఎప్పుడు ప్రకటిస్తారు

2024 సంవత్సరానికి సంబంధించి వాలంటీర్ సేవ పురస్కారాలను ఫిబ్రవరి 15 16 తేదీలలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అయితే ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ మార్చి నెలలోపు అందరి ఖాతాల్లో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సేవ అవార్డులకు సంబంధించినటువంటి అమౌంట్ ను జమ చేయడం జరుగుతుంది.

You cannot copy content of this page