ప్రతి ఏటా వాలంటీర్లకు సేవ పురస్కారాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలందించినటువంటి వాలంటీర్లకు ఈ పురస్కారాలను ఈ నెల 15న అందించనుంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో ఈ నెల 15న వాలంటీర్లకు వందనం
గుంటూరు జిల్లా తాడికొండ మండలం, ఫిరంగిపురంలో ఈనెల 15న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వాలంటీర్లకు సేవ పురస్కారాల కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
ఈ ఏడాది మొత్తం 255464 మందికి సేవ పురస్కారాలను అందించనున్నారు.
సేవ పురస్కారాలు మూడు కేటగిరీలలో..
ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు సేవ వజ్ర పురస్కారాలను అందించనున్నారు.
ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ఐదుగురు చొప్పున నగరపాలక సంస్థలో పదిమంది చొప్పున మొత్తం 4150 మందికి ఈ ఏడాది సేవా రత్న పురస్కారాలను అందించనున్నారు.
ఇక మిగిలిన వారందరికీ సేవా మిత్ర పురస్కారాలను ఇవ్వనున్నారు. 250439 మంది వాలంటీర్లకు ఏడాది సేవ మిత్ర పురస్కారం ఇవ్వనున్నారు.
అదనంగా 997 మందికి ప్రత్యేక బహుమతులు
పైన పేర్కొన్నటువంటి మూడు కేటగిరీలలో అందిస్తున్నటువంటి అవార్డులతో పాటు అదనంగా 997 మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు.
వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా మరియు వైయస్సార్ చేయూత పథకాలకు సంబంధించి మెరుగైన జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి వీడియోలను చిత్రీకరించినటువంటి వారికి ఈ బహుమానాలు ఇవ్వనున్నారు.
వారం రోజులపాటు కార్యక్రమం
ఫిబ్రవరి 15న రాష్ట్ర పరిధిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులపాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం కొనసాగనుంది.
ఇక ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మరియు జాబితాలను ఈ లింక్ ద్వారా చూడవచ్చు