సూపర్ 6 పథకాల అమలకు కట్టుబడి ఉన్నాం: నారా లోకేష్

సూపర్ 6 పథకాల అమలకు కట్టుబడి ఉన్నాం: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలకు కట్టుబడి ఉందని మరోసారి మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచినట్లు, దివ్యాంగులకు 6000కు పెంచినట్లు అదే విధంగా మెగా డీఎస్సీ కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15, 16 తేదీలలో అన్న క్యాంటీన్ లను ప్రారంభించామని ఇక మిగిలిన పథకాలను కూడా తప్పకుండా అమలు చేస్తామని ఆయన అన్నారు.

తల్లికి వందనం పథకాన్ని త్వరలో అమలు చేస్తామని, సాధ్యమైనంత ఎక్కువమంది అర్హులకు దీన్ని వర్తింపజేసేలా చూస్తున్నామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇక రైతులకు 20 వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

అంతేకాకుండా మహిళలకు ప్రతినెలా 1500 రూపాయలు అందించేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు రానున్న ఐదు ఏళ్లలో కల్పించడమే తమ లక్ష్యం అని మరోసారి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

TDP Super Six Schemes 2024: తెలుగుదేశం కూటమి అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలు

  1. యువత కు 20 లక్షల ఉపాధి అవకాశాలు (3 వేల నిరుద్యోగ భృతి)
  2. తల్లికి వందనం ద్వారా ప్రతి స్కూల్ కి వెళ్ళే విద్యార్థి కి 15000
  3. ప్రతి రైతుకూ ఏటా ₹20000 (అన్నదాత సుఖీభవ)
  4. ప్రతి ఇంటికి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
  5. ప్రతి మహిళ కి ప్రతి నెల ₹1500
  6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఈ పథకాలను మరింత వివరంగా చూద్దాం.

  1. యువత కు 20 లక్షల ఉపాధి అవకాశాలు – తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టింది. అంతేకాకుండా యువతకు రానున్న ఐదు సంవత్సరాలలో20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని పేర్కొంది. [ఇందులో ఇప్పటివరకు మెగా డిఎస్సి ప్రారంభించడం జరిగింది]
  2. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి స్కూల్ కి వెళ్ళే విద్యార్థి కి 15000 – రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కూటమి ప్రకటించింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 15000 రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనున్నారు. [ప్రస్తుతం ఆధార్ ఎన్రోల్మెంట్ కి గడువు ఇవ్వటం జరిగింది]
  3. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా 20వేల రూపాయలు – ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏటా పీఎం కిసాన్ అమౌంట్ కలిపి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
  4. ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు – తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
  5. ప్రతి మహిళకు నెలకి 1500 – మహాశక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు 15,00 రూపాయలను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు టిడిపి కూటమి ప్రకటించింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి ఏడాది 18000 రూపాయలను మహిళల ఖాతాలో జమ చేయనున్నారు.
  6. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం – ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ కూటమి వెల్లడించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. మహిళలు ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడి ఎవరికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకాన్ని అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది.

ఇక తెలుగుదేశం పార్టీ అమలు చేసే 6 గ్యారెంటీ పథకాలను కింద తెలుసుకుందాం.

తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ పథకాలు

  1. మహా శక్తి
  2. పూర్ టు రిచ్
  3. యువగళం
  4. అన్నదాత సుఖీభవ
  5. ఇంటింటికీ మంచి నీరు
  6. బీసి లకు రక్షణ

1. మహా శక్తి పథకం ప్రయోజనాలు:

  • ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ కి ఆడబిడ్డ నిధి కింద నెలకు ₹1500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ.
  • తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ₹15000 చప్పున తల్లి ఖాతాలో జమ.
  • దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ లు ఉచితం.
  • రాష్ట్రం లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
Mahashakti Scheme

2. పూర్ టు రిచ్ పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే పేద బలహీన వర్గాలకు వివిధ ఉపాది సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించి వారిని ధనికులను చేసే పథకం.

Poor to Rich Scheme

3. యువగళం పథకం – యువగళం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రతి నిరుద్యోగికి ప్రతినెల 3000 రూపాయలను యువగళం నిధి కింద నిరుద్యోగ భృతి ఇస్తామని టిడిపి ప్రకటించింది.

Yuvagalam Scheme

4. అన్నదాత సుఖీభవ పథకం – ఈ పథకం ద్వారా రైతులకు ఏడాది కి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాము అందించనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

TDP Annadatha Scheme

5. ఇంటింటికీ నీరు పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీటి కులాయి కనెక్షన్ ఇవ్వనన్నట్లు కూటమి ప్రకటించింది.

Intintiki Neeru Scheme

6. బీసీలకు రక్షణ చట్టం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే బీసీలకు మరియు మైనారిటీలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వనున్నట్లు కూటమి తెలిపింది.

BC Rakshana Chattam

You cannot copy content of this page