ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గత ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లను మార్చిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెప్పి, పథకాలకు భరతమాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్టు మంత్రి లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో నూతన పథకాల పేర్లు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
పేర్లు మార్చిన పథకాల వివరాలు
పథకం పేరు | మార్చిన పేరు |
---|---|
జగనన్న అమ్మఒడి పథకం | తల్లికి వందనం |
జగనన్న ఆణిముత్యాలు | అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం |
స్వేచ్ఛ పథకం | బాలికా రక్ష |
మన బడి నాడు-నేడు | మనబడి- మన భవిష్యత్తు |
జగనన్న గోరు ముద్ద | డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ |
జగనన్న విద్యాకానుక | సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర |
పైన తెలిపిన పథకాల పేర్లను మార్చినట్టు మంత్రి లోకేష్ తెలిపారు.