AP Sand Online Booking: నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

AP Sand Online Booking: నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తోంది కానీ.. దాన్ని పొందడమే కొంత తలనొప్పిగా మారింది. ఈజీగా ఇసుక బుక్ చేసుకోవడం కష్టమైపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే ఇసుక బుక్ చేసుకునే విధానం తెచ్చింది. ఇవాళ్టి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

ఇసుక బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ (https://www.mines.ap.gov.in) తెచ్చింది. కొంతకాలంగా ఈ పోర్టల్‌ని తయారుచేస్తూ ఉంది. ఇప్పటికి ఇది పూర్తైంది. అందువల్ల ఇకపై ఏపీ ప్రజలు.. ఈ పోర్టల్ ద్వారా ఇసుకను ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు.

ఇసుక బుకింగ్ సమయాలు

ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది.ఇంటి నుంచి బుక్ చేసుకుంటే, సమస్యలు రావచ్చు అని భావించేవారు.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉ.10.30-మ. 12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చు. మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టల్ లో మార్పులు చేశారు. త్వరలో 24 గంటలూ బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండేలా CM చంద్రబాబు ఆదేశించడంతో, అధికారులు మార్పులు చేస్తున్నారు.

ఇసుక బుకింగ్ ఎలా చేసుకోవాలి

మీరు ఇంటి నుంచే ఇసుకను బుక్ చేసుకోవాలి అనుకుంటే.. ముందుగా https://www.mines.ap.gov.in పోర్టల్ లోకి వెళ్లింది. అక్కడ ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APSMS) విభాగంలోకి వెళ్లి ముందుగా రిజిస్టర్ అవ్వాలి. ఇందుకోసం జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ ఐడీ నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఈ-మెయిల్ ఐడీ, అడ్రెస్ వివరాలు ఇచ్చి, సబ్‌మిట్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత నిర్మాణ వివరాలు ఇచ్చి, ఇసుక కోసం బుకింగ్ చేసుకుంటూ.. రవాణా ఛార్జీలు చెల్లిస్తే… ఇసుక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

కొంతమంది ఈ బుకింగ్‌తో సంబంధం లేకుండా.. వాగులు, వంకల దగ్గరకు వెళ్లి.. స్వయంగా ఇసుకను తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారిని ఎవరూ అడ్డుకోరు. అలా అడ్డుకోవద్దని స్వయంగా సీఎం చంద్రబాబే తెలిపారు. అందువల్ల వ్యక్తులు.. తమ అవసరాల కోసం స్వయంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం వారు స్వయంగా చిన్న వాహనాన్ని వెంట తెచ్చుకోవచ్చు.

ఉచిత ఇసుక డోర్ డెలివరీ చార్జీలు ఇవే

ఇసుక డోర్ డెలివరీకి వాహనదారులు వసూలు చేయాల్సిన చార్జీలు ప్రాథమికంగా ఈ విధంగా ఉన్నాయి

  • రీచ్, స్టాక్ పాయింట్ నుంచి 10కి.మీ. లోపు దూరమైతే.. టన్నుకు, కిలో మీటరుకు ₹12 చొప్పున ధర నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నారు.
  • దూరం పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. గరిష్ఠంగా 40 కి. మీ. కంటే ఎక్కువ దూరం ఉంటే టన్నుకు ప్రతి కిలోమీటర్ కి ఆరు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.

You cannot copy content of this page