AP PENSION: ఏపి లో పెన్షన్ 7 వేలు, జూలై నెల నుంచి పంపిణీ

AP PENSION: ఏపి లో పెన్షన్ 7 వేలు, జూలై నెల నుంచి పంపిణీ

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే నెల పెన్షన్ 7 వేలు. అవును మీరు చదువుతున్నది నిజమే.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి 4 వేల రూపాయలు పెన్షన్ అందించనున్నట్లు గతంలో హామి ఇవ్వడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి భావించినట్లు గానే భారీ మెజార్టీ తో అధికారంలోకి రావడం జరిగింది. జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి జూలై నెల నుంచి మాత్రమే పెన్షన్ ఇచ్చే వెసులుబాటు ఉంది.

అయితే ముందుగానే హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ మరియు జూన్ నెలలకు సంబంధించి వృద్ధులు, వితంతువులు మరియు ఇతర సామాజిక పెన్షన్లు పొందే వారికి 3 వేల రూపాయలు మాత్రమే లభించింది. ప్రతి నెల 1000 చప్పున మూడు నెలలకు పెండింగ్ 3000 రూపాయలు మరియు వచ్చే నెల నుంచి ప్రతినెలా ఇవ్వనున్న నాలుగు వేల రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలను జూలై నెలలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఆ తర్వాత ఆగస్టు నెల నుంచి యధావిధిగా నాలుగు వేల రూపాయలు ప్రతినెలా జమ చేస్తారు.

ఇక దివ్యాంగుల కైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరువేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వీరికి కూడా ఏప్రిల్ నుంచి ఉన్న పెండింగ్ అమౌంట్ కలుపుకొని జూలై నెలలో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65,30,838 పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో వాలంటర్లను పక్కన పెట్టి అర్హులైన లబ్ధిదారులకు dbt పద్ధతిలో నేరుగా పెన్షన్ అమౌంట్ ను వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే దివ్యాంగులు మరియు నడవలేని పరిస్థితిలో వారు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం జరిగింది.

ఇక వచ్చే నెల నుంచి మరి బ్యాంక్ ఖాతాలో చిన్న చేస్తారా లేక ఇంటి వద్దనే పంపిణీ చేస్తారా? లేదా ఎన్నికల సమయంలో పాటించిన విధంగా పాక్షికంగా డోర్ డెలివరీ మరియు DBT పద్ధతిని ఎంచుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి మార్గదర్శకాలు ఈ నెలాఖరికి వచ్చే అవకాశం ఉంది. అయితే వాలంటీర్లను పూర్తిస్థాయిలో ఎందుకు వినియోగిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి.

ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ అమౌంట్ పరిగణలోకి తీసుకుంటే జూలై నెలలో భారీగా 7000 పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి 4000 ప్రతినెల కొత్త ప్రభుత్వం అందించనుంది. మరిన్ని విధి విధానాలు ఈ నెల ఆఖరికి విడుదల కానున్నాయి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ట్విట్టర్ లో ఫాలో అవ్వండి.

You cannot copy content of this page