ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెన్షన్ల ను రెట్టింపు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అందరికీ కాదు. కింద పేర్కొన్న వారికి మాత్రమే అని జీవో లో పేర్కొంది
పెన్షన్ అమౌంట్ డబల్ అయితే వీరికి మాత్రమే
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతి రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరికి ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ అమౌంటు ను ఏకంగా రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇకనుంచి వారికి 5000 రూపాయలు ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొనడం జరిగింది. ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు ఈ అమౌంట్ రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కరెక్ట్ గా నెలరోజుల ముందు ఈ పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ లింకు లో పొందవచ్చు