‘
కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థు లకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు ‘జగనన్న గోరుముద్ద’గా అందించగా, ఇకపై విద్యార్థులకు -పోషణ్ గోరుముద్ద’గా అందించనున్నారు.
వారంలో ఐదురోజుల పాటు విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డు సరఫరాకు మార్గదర్శకాలు జారీచేశారు. ప్రతి వారం ఒక రంగులో గుడ్లను సరఫరా చేయాలని, ఈ మేరకు సప్లయిర్లకు సూచిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మధ్యాహ్న భోజనం డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
ఇక బెల్లం చిక్కీలను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాలలకు అందించాలని, బడులు తెరిచే నాటికి మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం, రాగిపిం డి, బెల్లం పొడి సిద్దం చేయాలని అంబేద్కర్ పేర్కొన్నారు.