ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. జీతాల పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో ఆయాలు, వాచ్‌మెన్‌లకు జీతాలను పెండింగ్ పెట్టారని.. టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు కూడా నిధులివ్వలేదని.. ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశాలు జారీచేశారు.
మంత్రి ఆదేశాలతో ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు చొప్పున మొత్తం రూ.89.9 కోట్ల బకాయిలు విడుదల చేసింది.. ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. జీతాలు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిల చెల్లింపుపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.. ఆ జీవో కాపీని కూడా జత చేశారు.
‘నాడు-నేడు పేరుతో రంగులు వేసి వేలకోట్లు దిగమింగిన వైఎస్సార్‌సీపీ పాలకులు పాఠశాలల్లో ఆయాలు, వాచ్ మెన్లకు జీతాలు బకాయి పెట్టి వెళ్లిపోయారు. టాయ్ లెట్ క్లీనింగ్ మెటీరియల్ కు కూడా నిధులు ఇవ్వలేదు. ఇటీవల పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. ఆయాలు, వాచ్ మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయ్ లెట్ క్లీనింగ్ మెటీరియల్‌కి 23.52 కోట్లు మొత్తంగా 87.9 కోట్ల బకాయిలు నేడు విడుదలయ్యాయి’ అంటూ ట్వీట్ చేశారు.