ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. ధాన్యం మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం

ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. ధాన్యం మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం

ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల మద్దతు ధరకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం కొత్త పద్ధతిలో రైతుల నుంచి ధాన్యం సేకరించబోతోంది. వారు ధాన్యం సేకరణ కేంద్రాలు మరియు రైతు సేవా కేంద్రాలు అనే ప్రత్యేక ప్రదేశాలలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. దీన్ని ఎలా చేయాలో కొన్ని నియమాలను రూపొందించారు. ఇ-క్రాప్ మరియు ఇ-కెవైసి అనే వాటిని ఉపయోగించి రైతుల నుండి సమాచారాన్ని సేకరించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు చెల్లించేలా చూస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఏపీ పౌరసరఫరాల శాఖ, మార్క్ ఫెడ్ అనే రెండు గ్రూపులు సహకరిస్తాయి.

మరోవైపు ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణకు ఉద్దేశించిన ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో నమోదు కావాలని సూచించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వెల్లడించారు. అక్టోబర్ ఒకటి నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని ఇటీవల నిర్వహించిన వర్క్ షాపులో తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని.. ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతు ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే లారీలు, గన్నీబ్యాగులను సైతం సిద్ధం చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించింది. మరోవైపు కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300, గ్రేడ్ ఏ రకానికి రూ.2320 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు.

You cannot copy content of this page