ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో సచివాలయం మరియు వాలంటర్ల శాఖ కు మంత్రి గా బాధ్యతలు చేపట్టిన డోలాబాలవీరాంజనేయ స్వామి గుడ్ న్యూస్ తెలిపారు.
ఎన్నికల సమయంలో తమ పార్టీ హామి ఇచ్చిన మేరకు వాలంటీర్ల ను కొనసాగిస్తామని అన్నారు. అయితే రాజీనామా చేయని వాలంటీర్ల ను మాత్రమే కొనసాగిస్తామని తెలిపారు.
జూలై నెల పెన్షన్ పంపిణీ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల సహకారంతో ఇంటి వద్దనే జూలై నెల పెన్షన్ పంపిణీ చేసేలా కార్య చరణ రూపొందిస్తామని ఆయన అన్నారు.
ఈ నిర్ణయంతో వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ప్రస్తుత ప్రభుత్వం తమ సేవలను వినియోగిస్తుందా లేదా అనే సందేహానికి తెర పడినట్లు అయింది.