ఏపీలో 100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్ళు

ఏపీలో 100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్ళు

ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదలందరికీ ఇల్లు మంజూరు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చక చక అడుగులు వేస్తుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ పై మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు.

ఏపీలో 100 రోజుల్లో 1.28 లక్షల ఇల్లు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి గృహ నిర్మాణ స్థితిగతులపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు గత ప్రభుత్వ హయాంలో పీఎం అవాస్ పేదలందరికీ ఇల్లు ద్వారా కేటాయించారు? ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి? ఇంకా ఎన్ని ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది? తదితర అంశాలపై మంత్రి పార్థసారథి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు వంద రోజుల ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. త్వరిత గతిన ఇల్లు పూర్తి చేసి పేదలకు అందించే లక్ష్యంతో వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రణాళిక వేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ గృహ నిర్మాణాల కోసం 2,520 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో అనుసంధానమై వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8.02 లక్షల గృహాలను పూర్తిచేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.

You cannot copy content of this page