జూలై 1 రాష్ట్రంలో కందిపప్పు, పంచదార పంపిణీ

జూలై 1 రాష్ట్రంలో కందిపప్పు, పంచదార పంపిణీ

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు చేపడుతుంది.

గత ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల ఏడాదిగా కందిపప్పు పంపిణీ జరగడం లేదు. దీంతో గత్యంతరం లేక బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి..

ఈ నేపథ్యంలో వీటి పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది.. రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పును కొను గోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించడం జరిగింది. ఈనెల 20 తర్వాత రాష్ట్ర వ్యప్తంగా ఉన్నటువంటి రేషన్ షాప్ లకు ప్రభుత్వం ఉచిత బియ్యం తో పాటు కందిపప్పు, పంచదారను రాయతీ ధరలకు సరఫరా చేయనుంది.

వచ్చే నెల ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కందిపప్పు మరియు పంచదారను ప్రభుత్వం విధిగా పంపిణీ చేయనుంది.

You cannot copy content of this page