ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆదివారం ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం (AP FREE BUS SCHEME) పథకం సహా ఇతర ముఖ్యమైన పథకాలు, ప్రాజెక్టుల పై కీలక వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అందుకు అనుగుణంగా నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన మీడియా కు వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడల పరంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఇటీవల క్రికెట్ అసోసియేషన్ పని తీరు పై వచ్చిన ఆరోపణలను కూడా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ఉ చిత బస్ ప్రయాణం పథకం – ముఖ్య లక్షణాలు
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
- APSRTC పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ నాన్ AC బస్సులు, మెట్రో నాన్ ఏసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది.
- మహిళలు , బాలికలు మరియు ట్రాన్స్జెండర్లు ఈ పథకానికి అర్హులు.
- ఈ పథకం AC, నాన్ AC సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ స్లీపర్ మరియు ఇతర AC సేవలకు వర్తించదు.
- ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా స్థానిక ID రుజువును మహిళా ప్రయాణికులు చూపవచ్చు.
పైన పేర్కొన్న అంశాలు ప్రాథమికంగా ఉన్న సమాచారాం మేరకు ఇవ్వడం జరిగింది. ఒక నెలలోపు పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.