ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం తొలి రోజు చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు ఇవే
- మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్ ముందుంచారు. జులై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు.
- ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,
- ఏప్రిల్ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, (జులై 1 నుంచి రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంచే నిర్ణయానికి ఆమోదం) , అయితే ఈ పెంపు ఏప్రిల్ నుంచి వర్తిస్తున్న నేపథ్యంలో జూలై 1 న 7 వేలు పెన్షన్ అమౌంట్ పంపిణీ, తదుపరి నెల నుంచి 4 వేలు. దివ్యాంగులకు 6 వేలు పెన్షన్ పెంపు పై ఆమోదం. పెంచిన అన్నీ పెన్షన్ వివరాలు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
- ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ ఉంటుంది. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు.
- అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, వచ్చే 100 రోజుల్లో 200 పైగా అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉంచేలా కార్యచరణ. ఆగస్టు నుంచి 183 అన్న క్యాంటీన్లు ఆ తర్వాత మరో 20 జోడించనున్న ప్రభుత్వం.
- నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- విజయవాడ లోని వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్శిటీ గా మార్చడానికి క్యాబినెట్ ఆమోదం
- కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.