AP Budget 2024 Key Highlights: ఏపీ బడ్జెట్‌ 2024 ముఖ్యాంశాలు

AP Budget 2024 Key Highlights:  ఏపీ బడ్జెట్‌ 2024 ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు.

మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25ను ఆర్థిక మంత్రి సమర్పించారు.

ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు.

  • ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు .

ఇక జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా ఉంది.

మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన సభకు వివరించారు.

You cannot copy content of this page