ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు, అన్న క్యాంటీన్ మెనూ, టైమింగ్, అడ్రస్ మరియు ఇతర వివరాలు

ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు, అన్న క్యాంటీన్ మెనూ, టైమింగ్, అడ్రస్ మరియు ఇతర వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ భోజనం అందించే అన్న క్యాంటీన్(Anna Canteen) లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆగస్టు 15న ప్రారంభించారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్ల ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి అన్న క్యాంటీన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఆగస్టు 15న మధ్యాహ్నం 12:30 కు ప్రారంభించారు.

మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్న క్యాంటీన్లను మంత్రులు మరియు అధికారులు జిల్లాల స్థాయిలో ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 అన్న క్యాంటీన్లు ఆగస్టు 16 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్ నెల ఆఖరు నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్ ను ప్రభుత్వం నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల లో అందించే ఆహార మెనూ, అన్నా క్యాంటీన్ సమయాలు, అన్నా క్యాంటీన్ జిల్లాల వారీగా అడ్రస్ మరియు అన్ని ఇతర వివరాలు మీకోసం.

అన్న క్యాంటీన్ మెను – అన్న క్యాంటీన్ ఆహార పట్టిక ఇదే [Anna Canteen Menu 2024]

ప్రతిరోజు (ఆదివారం మినహా) అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలకే టిఫిన్ మరియు భోజనం అందించడం జరుగుతుంది. ఏ రోజు న ఏ టిఫిన్ మరియు భోజనం అందిస్తారు అనే పూర్తి పట్టిక కింద ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపాయలకే ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి ఐటమ్స్ ని అందిస్తుంది. అయితే ఇడ్లీ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ఇక లంచ్ లో వైట్ రైస్, కూరా, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి, వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ వంటివి కూడా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది.

సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం:

  • సోమవారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా పూరి, కుర్మా
  • మంగళవారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి , సాంబార్, మిక్చర్
  • బుధవారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి , సాంబార్, మిక్చర్
  • గురువారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా పూరి, కుర్మా
  • శుక్రవారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి , సాంబార్, మిక్చర్
  • శనివారం: ఇడ్లీ చట్నీ/పొడి + సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి , సాంబార్, మిక్చర్

సోమవారం నుంచి శనివారం వరకు అందించే లంచ్ మరియు డిన్నర్ భోజనం

వైట్ రైస్ , కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ కూడా అందిస్తారు.

ఆదివారం సెలవు ఉంటుంది.

అన్నా క్యాంటీన్ సమయాలు (Anna Canteen timings)

బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు

లంచ్ 12:30 నుంచి 3:00 వరకు

డిన్నర్ 7:30 నుంచి రాత్రి 9 గంటల వరకు.

కేవలం ఐదు రూపాయలకే ఇన్ని ఐటమ్స్ పెట్టటం, అది కూడా పరిశుభ్రమైన ప్రదేశంలో ఇవన్నీ సర్వ్ చేయటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్న క్యాంటీన్ల లిస్ట్ (Anna Canteen List 2024)

SnDistrictULB NameLocation of Anna Canteen
1  SrikakulamPalasa KasibuggaNear old bus stand, Kasi-Bugga
2Srikakulam7 road junction
3SrikakulamPotti sri ramulu junction
4VizianagaramVizianagaramPrakasam park
5VizianagaramRTC Complex
6    East GodavarikovvuruAPSRTC Premises
7NidadavolePangidi Road 27th ward
8RajamahendravaramAnnam kalakshetram gokavaram bustand
9RajamahendravaramGovt Hospital
10RajamahendravaramQuarry Market
11    EluruEluruAt SBI
12EluruRR Peta
13EluruTangellamudi
14EluruRice millers association
15NuzividRural police station
16        KakinadaKakinadaAnnamma Ghati Junction
17KakinadaDairy Market
18KakinadaSanta Cheruvu
19KakinadaSarpavaram Junction
20KakinadaVivekananda Park
21PeddapuramOpp. Municipal Office
22PithapuramRTC Bustand Uppada Municipal guest house
23SamalkotRTC Complex
24KonaseemaMandapetaJunior college premises, Yeditha road
25RamachandrapuramBeside Old Bustand
26    KrishnaGudivadaTummala RamaBrahmam Park Premises
27GudivadaMahathma Gandhi Municipal Shopping Complex
28MachilipatnamWater Works Area
29PedanaNear RTC Bustand
30VuyyuruMahatma Gandhi Municipal Shopping Complex
31              NTRJaggaiahpetSeetharamapuram Mandal Parshid School
32NandigamaRaithu Bazar
33TiruvuruOpposite Masjid, Main Road, Tiruvuru
34VijayawadaAPSRM School
35VijayawadaAyodyanagar budameru vagu
36VijayawadaBavaji Pet (Gulabi Thota) Near A.S Raju Bridge
37VijayawadaDharna Chowk
38VijayawadaGandhi mahila kalasala
39VijayawadaHousing Board colony
40VijayawadaPatamata High School
41VijayawadaRanigari Thota (CEMENT GODOWN)
42VijayawadaRTC Work Shop Road Vidyadarapuram
43VijayawadaSai Baba Temple Near Netaji Bridge
44VijayawadaSingh nagar
45        West GodavariBhimavaramAt Bullock cart Stand
46BhimavaramAt RTC bus stand (Wednesday Market )
47BhimavaramR&B DEPARTMENT
48PalakolluSivalayam Road Old Water Tank area
49TadepalligudemBR market, 14th ward
50TadepalligudemAt M.R.O office, 8th ward
51TadepalligudemAuto stand center near the municipal office
52TanukuOPP. Mee Seva
53    BapatlaAddankiNSP Office Premises
54BapatlaAuto stand centre near the municipal office
55ChiralaOpp Vasavi cloth market
56Repalle86- In front of DTC office Premises
57              GUNTURGuntur85- ID Hospital Amaravathi Road
58GunturMunicipal School – Mee Seva’s Backside
59Guntur87- Mirchi Yard
60Guntur88- Nalla Cheruvu Road near Water tanks
61Guntur89- Pallanadu Bus Stand
62Guntur91- Raitu Bazar near RTC Bus stand
63Guntur84- Agriculture Office
64MTMCNear RTC Old Bus stand
65MTMCNulakapeta
66MTMCUndavalli
67PonnurSubbaraya Satram
68TenaliNear Vegetable Market, opp Municipal Office
69TenaliMarket Yard
70Tenalinear RTC complex
87        SPSR NelloreNelloreAc Market
88NelloreAt Fish Market
89NelloreAt Pwd office
90NelloreIndira Bhavan
91NelloreJawahar Bala Bhavan
92NelloreOld Municipal office
93NelloreSeri Culture Office
71KandukurOld Fish Market
72KavaliMRO OFFICE PREMISES
73        PalnaduChilakaluripetClock tower center
74ChilakaluripetNRT center
75ChilakaluripetVeterinary hospital
76MacherlaMain Road R&B Guest House
77NARASARAOPETAt Vegetable Market
78NARASARAOPETPALNADU Bus Stand
79NARASARAOPETStadium
80PidugurallaMacherla-Guntur Main road near Govt Hospital
81SattenapalleAt MRO Office
82    PrakasamChimakurthyBack side of MRO office
83OngoleAmbedkar park
84OngoleOld RIMS
85OngoleRytu Bazaar
86OngoleVegetable Market
94AnnamayyaMadanapalleAgricultural Market yard
95Madanapalleweekly Market
96  ChittoorKuppamRadha Krishna Road
97PalamanerBeside anna canteen
98PunganurPanchayat Raj Office
99Sri Satya SaiHindupurAP Transco office
100HindupurGovt Hospital
Anna Canteen List 2024 with Addresses

You cannot copy content of this page