ఆరోజు నుంచే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభం

ఆరోజు నుంచే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభం

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తోంది. సూపర్ సిక్స్‌ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు… ఇటీవలె ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు.

రాష్ట్రంలో పేదలకు రూ.5కే భోజనం అందించేందుకు ‘2014-19 మధ్య తెదేపా హయాంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించగా, అప్పట్లో 183 అందుబాటులోకి వచ్చాయి. మిగతా 20లో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయి. మరో రెండింటి నిర్మాణం ప్రాథమిక దశలో ఉంది.వీటన్నింటికి మరమ్మతులు చేపట్టి, ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, అన్నిచోట్లా క్యాంటీన్లు ఒకే మాదిరిగా, ఒకే భోజన మెనూతో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసింది. ఈసారి కూడా అదే తరహాలో, అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచాం. ఈనెల22న టెండర్లు తెరుస్తామని వివరించారు.

You cannot copy content of this page