కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ 2024 25 ను జూలై 23న పార్లమెంటులో ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల పైన అందరి చూపు ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్, ఈ రెండు రాష్ట్రాల సపోర్ట్ తోనే కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీటికి ప్రముఖంగా కేటాయింపులు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు ఇచ్చారా లేదా బీహార్ కి ఎక్కువ ఇచ్చారా అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇక పోతే ఆంధ్రప్రదేశ్ కి 15000 కోట్లు అప్పు ఇచ్చారా లేదా గ్రాంట్ ఇచ్చారా అనే దాని పైన కూడా ఆసక్తి నెలకొంది.
దీనిపైన ఆంధ్రప్రదేశ్ కు మరియు బీహార్ కి ఇచ్చిన కేటాయింపులను ఒకసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ Vs బీహార్ కేటాయింపులు ఇలా..
ఏపి కేటాయింపులు :
1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం
2. రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి అధిక నిధులు
3. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ
4. పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
5. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం
6. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి
7. విశాఖ – చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు
8. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు
9. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు
10. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్.
ఇవే కాకుండా ఇటీవల అమరావతి కి రైల్వే లైన్, హై వేలు, ఎస్ప్రెస్ వెలను కేంద్రం అంగీకరించింది. 25000 కోట్ల ORR ను కూడా అంగీకరించింది. వీటిని పైన పాయింట్ నంబర్ 8 కింద కేంద్రం సహాయం చేసే అవకాశం ఉంటుంది. పూర్తి అయిన పనుల మేర నిధులను మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
బీహార్ కేటాయింపులు:
1. బీహార్ లో హైవేల అభివృద్ధికి 26000 కోట్ల సహాయం. పట్నా-పూర్ణియా , బాక్సర్-భగల్పూర్, బోధగాయ-రాజ్ గిర్- వైశాలి-దర్భంగా ఎక్స్ప్రెస్ వేలకు, బక్సర్ వద్ద గంగా నది మీద రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేస్తారు.
2. 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ మంజూరు చేసింది.
3. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, కొత్త విమానాశ్రయాలు మరియు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సహాయం చేస్తామని ప్రకటించింది.
4. బీహార్ లోని గయాలో పారిశ్రామిక కారిడార్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
5. బీహార్ లో విష్ణుపత్, మహా బోధి, కాశీ విశ్వనాథ్,రాజ్ గిర్ వంటి చారిత్రక ప్రదేశాలను టూరిస్ట్ డెస్టినేషన్స్ గా అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లుగా గుర్తించి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
ఎవరికి ఎక్కువ బెనిఫిట్!
పైన పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాలకు కూడా కీలక కేటాయింపులను ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం కావాల్సిన అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
అయితే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ సహకారంతో అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఇది అప్పా గ్రాంటా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ తో నేరుగా సంప్రదించి రాష్ట్రానికి సహకారం అందిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వమే దీనిని భరిస్తుందని రాజధాని నిర్మాణం పూర్తయేవరకు సహకరిస్తుందని పేర్కొంది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పోలవరం కూడా నిర్మాణం అయ్యేవరకు భరిస్తుందని తెలిపింది. ఇంకా రాయలసీమకు, ఉత్తరాంధ్ర మరియు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది.
బీహార్ కు 26 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం హైవే లకు ఖర్చు చేస్తుండగా అటు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని పోలవరం మరియు ప్యాకేజీని బదులుగా ఇవ్వడం జరిగింది. ఇక బీహార్ కు ప్రత్యేకంగా పవర్ ప్లాంట్ అనేది చెప్పుకోదగిన కేటాయింపు. రెండు విధాలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు హైవే లకు మరియు 25వేల కోట్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వీటిని పైన పేర్కొన్నట్లుగా నీరు విద్యుత్ రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సహకారం అందిస్తామని తెలుపటం జరిగింది.
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి కూడా బీహార్ మాదిరిగా కేవలం హైవే లకు 26 వేల కోట్లు ఇచ్చి ఏదైనా పవర్ ప్లాంట్ ఇచ్చి ఉండుంటే ఉపయోగముండేది కాదు. వీటిని ఎలాగో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కింద మంజూరు చేస్తూ వస్తుంది. ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంది కాబట్టి విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. వీటికి అదనంగా రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు నిధులు పోలవరానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం అనేది బీహార్ తో పోల్చుకుంటే కొంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక క్వారీడార్ల నిధులను బీహార్ కి ఒకటి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కి రెండు చోట్ల కేటాయించడం అనేది గమనార్హం. కాబట్టి కొంతమేర బీహార్ కి నేరుగా హైవేల రూపంలో డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి చేసిన కేటాయింపులే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాల ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసినట్లు తెలుస్తుంది.
దీనిపై మీ కామెంట్ కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.