AI సిటీగా అమరావతి.. టెక్నాలజీ, మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

AI సిటీగా అమరావతి.. టెక్నాలజీ, మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏఐ, అమరావతిని కలిపి ఇంగ్లిష్‌లో మంచి లోగో రూపొందించాలని అధికారులకు సూచించారు. 90 రోజుల్లో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించాలని సూచించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు చెప్పారు. రాజధాని ప్రాంతంలో చేపట్టే అన్ని నిర్మాణాల్లోనూ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాజధానిలో ‘హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు’పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. హ్యాపీ నెస్ట్‌ ప్లాట్లన్నీ కేవలం గంటలో అమ్ముడుపోయాయని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పైనా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మెట్రో రైలు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విజయవాడతో పాటు విశాఖపట్నంలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు.

రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు 60 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇందు కోసం 190 ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు.

మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్ ఆవిష్కరణ

ఎంపాక్స్‌ (మంకీ పాక్స్‌) వ్యాధి నిర్ధారణకు ‘ఆర్టీ పీసీఆర్‌’ కిట్‌ ‘ఎర్బాఎండీఎక్స్‌’ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఈ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌ తయారీ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కిట్ ను ICMR, CDSCO ధ్రువీకరిచాయి. కిట్‌లోని లైయోఫైలైజ్డ్ కాంపోనెంట్‌లు షిప్పింగ్‌కు అనువుగా ఉన్నాయని, మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపయోగించేలా రూపొందించారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

ఈ మద్యం పాలసీ, టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ రుసుము విధించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఈ మేరకు వారు సమర్పించిన నివేదికలు, కన్సల్టెన్సీ టీమ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఎక్సైజ్‌ శాఖ.. వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఏపీలో మద్యం ధరలు కూడా తెలంగాణ, కర్ణాటకతో సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్‌) అరికట్టేందుకు వీలవుతుందని భావిస్తున్నారట. ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. అధ్యయన నివేదికలు, ఎక్సైజ్‌శాఖ ప్రాథమిక ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష చేయనుంది.

ఈ కమిటీ మద్యం వ్యాపారం, ధరలు, పన్నులపై ప్రధానంగా చర్చించనుంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంని… ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరో వారం రోజుల్లో మద్యం విధానాన్ని ఖరారు చేస్తారు.. అయితే సెప్టెంబరు 5 నుంచి ఎక్సైజ్‌లో బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మద్యం విధానం ఖరారు, దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియ అంతా సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. అక్టోబరు 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. అంతేకాదు గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెబ్‌ను రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రభుత్వం రద్దుచేసింది. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సెబ్‌లోని 70% సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకు రానున్నారు. మద్యం పాలసీతో పాటుగా ట్రాక్ అండ్ ట్రేస్, డీఅడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా ఫోకస్ పెట్టారు. అంతేకాదు మంచి బ్రాండ్‌లను కూడా అందుబాటులోకి తేస్తామని చెబుతోంది ప్రభుత్వం.

You cannot copy content of this page