అమరావతి రైల్వే లైన్ పనులు ప్రారంభం, కొత్త రైల్వే స్టేషన్లు ఇవే

అమరావతి రైల్వే లైన్ పనులు ప్రారంభం, కొత్త రైల్వే స్టేషన్లు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుతీరిన 10 రోజుల్లో పై అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి.

అమరావతి రైల్వే లైన్ 2017-18 లో మంజూరు అయింది. అయితే గత ప్రభుత్వ హయాం లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో భూసేకరణ కూడా జరగకుండానే నిలిచిపోయింది.

ఏపీలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి మొదలైంది. ఎందుకు సంబంధించి చకచకా అధికారులు భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు సంబంధించి రైల్వే శాఖ నుంచి గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

తొలుత 56.53 కిలోమీటర్ల లైన్ కు 450 హెక్టార్ల భూసేకరణ

అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో మొత్తం మూడు మార్గాలకు ఆమోదం లభించింది.

విజయవాడ గుంటూరు ప్రధాన రైల్వే స్టేషన్ల ను అనుసంధానిస్తూ, కింద ఇవ్వబడిన తొలి లైన్ ఉంటుంది. అవే కాకుండా రెండవ మరియు మూడవ లైన్ కూడా ఆమోదం పొందింది.

1. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు – 56.53 కిలోమీటర్ల లైన్. [డబుల్ లైన్]

2. అమరావతి – పెద్దకూరపాడు 24.5 కిమీ [సింగిల్ లైన్]

3. నరసరావుపేట – సత్తెనపల్లి 25 కిమీ [సింగిల్ లైన్]

అయితే తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన ఎర్రూపాలెం అమరావతి నంబూరు మధ్య 56.5 3 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది.

9 కొత్త రైల్వే స్టేషన్ లు ఇవే

తొలి దశ అమరావతి రైల్వే లైన్ లో నిర్మించబోయే కొత్త రైల్వే స్టేషన్లు ఇవే.

ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు రైల్వే లైన్ లోని రైల్వే స్టేషన్ వివరాలు:

  1. పెద్దాపురం
  2. చిన్నారావురు పాలెం
  3. గొట్టుముక్కల
  4. పరిటాల
  5. కొత్త పేట
  6. వడ్డ మాను
  7. అమరావతి
  8. తాడి కొండ
  9. కొప్పురావురు

మొదటగా హైదరాబాద్ విజయవాడ రైల్వే లైన్ లో ఉన్నటువంటి ఏర్రుపాలెం వద్ద ఇది మొదలై గుంటూరు విజయవాడ రైల్వే లైన్ లో ఉన్నటువంటి నంబూరు వద్ద కలుస్తుంది. ఇందులో ప్రధానంగా అమరావతి రైల్వేస్టేషన్ పెద్ద స్టేషన్ గా ఉంటుంది. పరిటాల వద్ద ఎక్కువగా గూడ్స్ రైళ్లు ఆపే సౌకర్యం కల్పిస్తారు.

ఈ రైల్వే ప్రాజెక్ట్ కు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. తొలుత సింగిల్ లైన్ నిర్మాణానికి 2600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా.

You cannot copy content of this page