తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మరొక హామీ నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల ఆఖరు నాటికి ఇందిరమ్మ ఇండ్లకు [Indiramma houses] శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మరియు సీతక్క తో పాల్గొన్న ఆయన ఈమేరకు ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3500 ఇళ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకునే అర్హులకు రానున్న రెండు నెలల్లో పట్టాలు ఇవ్వనున్నట్లుగా కూడా మంత్రి వెల్లడించారు.