వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి డిసెంబర్ 18వ తేదీన చేపట్టనున్నారు.
డిసెంబర్ 18 నుంచి వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.
– ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ కి వెళ్లి చెక్ అప్ చేయించుకునేందుకు ఫాలోఅప్ కన్సల్టేషన్ , రవాణాచార్జిల కింద 300 రూపాయలు చెల్లించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.
– అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ల కు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని కూడా ఆదేశించారు.
– ఇక ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి ఇంటింటి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.
– ఇక జనవరి 1 వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష 2.0 ప్రారంభించాలని తెలిపారు
– . అంతేకాకుండా ప్రజలు ఎవరికైతే ఆరోగ్యశ్రీ యాప్ ఇంకా వారి మొబైల్ లో డౌన్లోడ్ అయి లేదో అటువంటి వారి మొబైల్ లో డౌన్లోడ్ చేసే బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
– ఇక ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు