ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు… ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు… ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబరు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆగస్టు 15న మొదటి అన్న క్యాంటీన్ను కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఆగష్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు.

2014-19లో తెదేపా హయాంలో రూ.5కే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది.

క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది.

పురపాలక ప్రాంతీయ కార్యాలయాల వారీగాఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ల వివరాలు

ప్రాంతీయ కార్యాలయంక్యాంటీన్ల సంఖ్య
విశాఖపట్నం32
రాజమహేంద్రవరం51
గుంటూరు50
అనంతపురం50

తొలివిడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకుముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు.మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగాపూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకుప్రభుత్వం ఆదేశించింది.

You cannot copy content of this page