తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైనటువంటి క్యాబినెట్ ఈ మెరకు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు గ్రామాల్లో లక్షన్నర వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే బిపిఎల్ పరిధిలోకి వస్తారు. అటువంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తూ వస్తోంది. అయితే ఇకమీదట వార్షిక ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. రేషన్ కార్డుల జారీ కోసం పూర్తి విధి విధానాలు రూపొందించాలని, బిపిఎల్ నిర్వహించనాన్ని సవరించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా మార్గదర్శకాలు రూపొందించేందుకుగాను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో చాలామంది రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియకు క్యాబినెట్ ఆముదం తెలపడంతో చాలామందికి మేలు చేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.