తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి హామీలు అమలు చేయనున్నారో క్లారిటీ ఇచ్చింది.
మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక అంశాలు
మహాశక్తి పథకం ద్వారా నెలకు ₹1500
18 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలను జమ చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో వెల్లడించారు. ఇంట్లో ఎంత మంది ఆడ వారు ఉంటే అంత మందికి ఈ అమౌంట్ ఇస్తామని తెలిపారు. ఏడాదికి 18000 వీరి ఖాతాలో జమ చేస్తామని అన్నారు.
రైతులకు ప్రతి ఏటా 20000 రూపాయలు
అన్నదాత పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయలను తమ అకౌంట్లో జమ చేయనున్నట్లు టిడిపి ప్రకటించింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వివరించారు.
అమ్మకు వందనం కింద చదువుకునే ప్రతి బిడ్డకు 15000
విద్య ను ప్రోత్సహించేలా అమ్మకు వందనం పథకం తెస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి బిడ్డ చదువుకునేందుకు సంవత్సరానికి 15000 రూపాయలు.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 తల్లుల ఖాతాలో జమ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
నిరుద్యోగులకు నెలకు 3 వేలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు తెలిపారు
ఐదు ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు
తాము అధికారంలోకొస్తే యువతకు రానున్న ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ గళం పేరుతో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
జిల్లా లోపల ప్రయాణించేటటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పేదలను ధనికులకు చేసే పూర్ టు రిచ్
రాష్ట్రంలో ఉండే పేద వారిని ధనికులుగా చేస్తామని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఇతర పథకాలు
పైన ప్రకటించినవే కాకుండా బీసీలకు రక్షణ చట్టం , ప్రతి ఇంటికి ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితం, ప్రతి ఇంటికీ ఉచిత నీరు వంటి హామీలను కూడా ప్రకటించారు.
Leave a Reply