గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇన్ చంద్రబాబు నాయుడు గారు 26 అక్టోబర్ జరిగిన పార్టీ కార్యాలయంలో 2024 – 26 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఉన్న సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
టిడిపి సభ్యత్వ నమోదు ఫీజు – TDP Membership Registration Fees
- సభ్యత్వ నమోదు కేవలం 100 రూపాయలు మాత్రమే.
- లక్ష రూపాయలతో నమోదు చేసుకున్న వారికి జీవితకాలం సభ్యత్వం లభిస్తుంది
Life Time Membership | 1 Lakh |
General Membership (for 2 years) | 100 |
గతంలో రెండు లక్షలుగా ఉన్న బీమాను 5 లక్షల వరకు పెంచడం జరిగింది. సభ్యత్వం పొందిన వ్యక్తి మరణించిన లేదా కనపడక పోయిన బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ సాయం చేస్తారు.
టిడిపి సభ్యత్వ నమోదు విధానం – TDP Membership Registration Process
మొదటగా తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి
పైన విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత నమోదు చేసుకోండి అనే బటన్ పై క్లిక్ చేయండి
నమోదు చేసుకోండి పై బటన్ పై క్లిక్ చేసిన తర్వాత, పైన చూపించిన విధంగా మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు జనరల్ మెంబర్షిప్ లేదా లైఫ్ టైం మెంబర్షిప్ లేదా పార్టీకి డొనేషన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
జనరల్ మెంబర్షిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన తెలిపిన విధంగా new registration మరియు renewal ఆప్షన్ కనిపిస్తాయి. ఇంతకుముందు మీకు మెంబర్షిప్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. గతంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే renewal ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి
న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత Do you have voter id ? అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీకు ఓటర్ ఐడి ఉంటే yes అని లేదంటే no అని సెలెక్ట్ చేసుకోండి
ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఓటర్ ఐడి వివరాలు ఎంటర్ చేసి Get Voter ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఓటరు ఐడి కి సంబంధించిన వివరాలు చూపిస్తుంది. డీటెయిల్ సరి చూసుకొని Enroll Now ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
Enroll Now ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి.
తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Get ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి రాగానే ఎంటర్ చేసి Verify OTP పైన క్లిక్ చేయండి.
తరువాత మీ Nominee Details ఎంటర్ చెయ్యండి. మీ ఓటర్ ఐడి కి లింక్ అయినా నామినీ డీటెయిల్స్ కింద విధంగా చూపిస్తాయి. అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా Add Nominee పైన క్లిక్ చేసి Nominee Details ఎంటర్ చెయ్యవచ్చు. తరువత nominee తో relation సెలెక్ట్ చేసుకోండి.
తరువాత మీ ఫోటో upload చెయ్యండి
తరువాత Lifetime Membership లేదా General Membership అనేది సెలెక్ట్ చేసుకోండి.
తరువాత Pay Now ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
తరువాత మీ పేమెంట్ చెయ్యండి. Payment చేసిన తర్వాత మీ మెంబర్షిప్ డీటెయిల్స్ కింది విధంగా చూపిస్తాయి.
Leave a Reply