ఇటీవల వైసిపి గృహ సారథులు మరియు పార్టీ కన్వీనర్ ల నియామక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఈ నియామకం పూర్తి అయింది. అదే విధంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారా కూడా ఇలాంటి వ్యవస్థ కు సంబందించిన ఒక ప్రకటన విడుదల అయింది.
తెదేపా లో కొత్త వ్యవస్థ కు రూపకల్పన చేస్తున్నట్లు కాకినాడ జిల్లా పర్యటన లో భాగంగా ఆయన అనౌన్స్ చేశారు.
ఆ వ్యవస్థ పేరును “కుటుంబ సాధికార సారథులు” గా పెడుతున్నట్లు తెలిపారు.
పార్టీ కోసం కష్ట పడుతున్న వారికి ఈ అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి 30 ఇళ్లకు ఒక “కుటుంబ సాధికార సారథి” ని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పార్టీ లో ఉన్న సెక్షన్ ఇంచార్జ్లు అందరినీ సారథులు గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీ అధికారం లో ఉన్నప్పుడు వీరికి సరైన న్యాయం చేయలేక పోయామని అందుకే కొత్త వ్యవస్థలను తీసుకు వచ్చి సరైన న్యాయం చేస్తామని వెల్లడించారు. ఇందులో మహిళలకు కూడా సమ ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.
కుటుంబ సాధికార సారథుల బాధ్యతలు ఎంటి?
ప్రతి ముప్పై ఇళ్లకు ఒకరిని నియమించి, ఆర్థిక అసమానతలు తొలగించేలా వీరు పని చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. వీరి కోసం ప్రతి నియోజక వర్గానికి కుటుంబ సాధికార సారథులు విభాగం ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు.
అయితే అధికారం లో కి వచ్చాక వీరికి ఎం బాధ్యతలు ఇస్తారు అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు.
ఇప్పటికే వైసిపి ద్వారా 5.2 లక్షల గృహ సారథులు మరియు పార్టీ కన్వీనర్ లను నియమించిన నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి కూడా ఇలాంటి ప్రకటన రావడం రాజకీయంగా మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.
Leave a Reply