గ్రామ వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేస్తారు.
ఇప్పటికే సచివాలయాలను కొనసాగిస్తామని పలమార్లు పేర్కొన్న ఆయన తాజాగా వాలంటీర్లకు సంబంధించి కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
గ్రామ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అయితే గ్రామ వార్డు సచివాలయాలను మరియు వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
అదేవిధంగా సర్పంచులకు అధికారాలను తిరిగి కల్పిస్తామని మరియు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు తెలిపారు.
అయితే గ్రామ వార్డు వాలంటీర్లు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరించకూడదని అలా చేయడం తగదని వ్యాఖ్యానించారు.
ఈ ఆర్టికల్ పై మీ ఒపీనియన్ కింది కామెంట్ ఆప్షన్ ద్వారా తెలియజేయండి
Leave a Reply