గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ..లోకేష్ ఎమ్మన్నారంటే

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ..లోకేష్ ఎమ్మన్నారంటే

ఏపి లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పై టీడీపీ క్లారిటీ ఇచ్చింది.

టిడిపి ప్రభుత్వం వస్తె గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారని పలు మార్లు వైసిపి ద్వారా విమర్శలు వచ్చిన నేపథ్యం లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించమని స్పష్టం చేశారు. వైసీపీ ఈ విషయం పై దుష్ప్రచారం చేస్తోందని నారా లోకేశ్ మండిపడ్డారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియమించడం జరిగిందని కావున, వాళ్లను తొలగించబోమని హామీ ఇచ్చారు.ఇప్పటికే ఈ విషయం పై తాను చాలా సార్లు చెప్పానని
గుర్తు చేశారు.

అంతే కాకుండా తమ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు టైంకు జీతాలిస్తామని, వైసీపీ లాగా వాళ్లను వేధించమని పాద యాత్ర లో భాగంగా హామీ ఇచ్చారు.

One response to “గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ..లోకేష్ ఎమ్మన్నారంటే”

  1. Ravi Avatar
    Ravi

    Great

You cannot copy content of this page