టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్స్ ను పౌర సేవలకు వినియోగిస్తాం
తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను కేవలం పౌర సేవల విభాగానికి మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. వాలంటీర్స్ కి ఎటువంటి రాజకీయ జ్యోక్యం ఉండదని అన్నారు.
ప్రజలకి సంబంధించిన ఎటువంటి పర్సనల్ వివరాలు వాలంటీర్స్ వద్ద ఉండడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
పౌర సేవలు అంటే ఏమిటి?
ప్రజలు (citizens) కి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న రేషన్ మరియు ఇతర సర్టిఫికెట్ల జారీ సంబంధించిన సేవలను సాధారణంగా పౌర సేవలు అని అంటారు.
తాము అధికారంలోకి వచ్చాక కేవలం కావాల్సిన సమాచారం మాత్రమే తీసుకుని ఈ సేవలను అందించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాలంటీర్లు సేకరిస్తున్న డేటా పై పెద్ద దుమారం చలరెగగా ప్రస్తుతం టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల కీలక సమాచారం ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రాని వాలంటీర్స్ వద్ద ఎలా ఉంటుందని ఇటీవల ఏపి హై కోర్ట్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Leave a Reply