ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కూల్ కి వెళ్లే పిల్లలకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం (Talliki Vandanam) పథకానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇచ్చారు.
మే నెల నుంచి తల్లికి వందనం.. మంత్రి వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ 15 వేల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేష్ మీడియాకు వెల్లడించారు.
ఇందుకోసం బడ్జెట్ లో 9,407 కోట్లను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు అందిస్తామని మంత్రి అన్నారు.

ఈ సమావేశంలో భాగంగా మంత్రి గత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని, అదేవిధంగా తల్లికి వందనాన్ని స్కూలు ప్రారంభమయ్యే నాటికే ప్రారంభిస్తున్నట్లు అన్నారు.
ఈ సమావేశంలో మంత్రి ఫరూక్ మరియు మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
Leave a Reply