ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 9 నెలల్లో వరుసగా అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రూ.4 వేలు పింఛన్ లేదని.. ఏపీలో మాతమ్రే ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే దీపం-2 కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని.. చెత్త పన్నును తొలగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లతో రూ.5కే భోజనం అందిస్తున్నామన్నారు.

ఏపీలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం.. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామని.. వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందన పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అర్హత ఉంటే చాలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే రూ.15వేల చొప్పున అందజేస్తామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి రావడంతో.. డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Leave a Reply