ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ కంటెంట్ తో ప్రభుత్వం ట్యాబ్‌లు ఇవ్వనుంది.
డిసెంబరు 21 న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4.60 లక్షల మంది విద్యార్థులకు, 60 వేల మంది ఉపాధ్యాయులకు ఈ ట్యాబులను పంపిణీ చేయనున్నారు.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ ట్యాబ్‌లు అందిస్తారు. ప్రభుత్వం ఇందుకోసం రూ.643 కోట్లను ఖర్చు చేస్తుంది. 8,395 పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయుల కు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PC ని ఇవ్వనున్నారు.
మొదట్లో 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే గాడ్జెట్‌లను అందించాలని ప్రతిపాదించగా, ఇప్పుడు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా ఈ సౌకర్యాన్ని కేబినెట్ కల్పించింది. ప్రభుత్వం సెప్టెంబర్ 5 న సంబంధిత కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులకు అందించే 64 GB మెమరీ కార్డ్‌తో కూడిన ఈ ట్యాబ్‌ను ప్రభుత్వం అందిస్తుంది
సెప్టెంబరులోనే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించినప్పటికీ ఒప్పందం ప్రకారం, విక్రేత ఆర్డర్ చేసిన పరిమాణంలో 50 శాతం 30 రోజుల్లోగా, మిగిలిన మొత్తాన్ని మరో 30 రోజుల్లో డెలివరీ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 9, 10 ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.13,000 ‘అమ్మ ఒడి’ బదులుగా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ల్యాప్‌టాప్‌కు సరఫరాదారులు రూ.24,000 బేస్ ధరను కోట్ చేయడంతో ప్లాన్ రద్దు అయింది. ఇకపై ప్రతి సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ట్యాబ్‌ల ఆలోచన చేసింది. విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం ట్యాబ్‌ల కోసం రూ.643 కోట్లు కానుంది. టెండర్లు ఆలస్యం కారణంగా మెుదట సగం మందికి, ఆ తర్వాత మిగిలిన వారికి పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ట్యాబ్ లో ఏ కంటెంట్ ఉంటుంది:
- ఫిజిక్స్ , కేమిస్ట్రీ, మాథెమాటిక్స్ , జువాలజీ , బయాలజీ , సివిక్స్ తదితర పాఠాలు ఉంటాయి.
- యానిమేషన్ , వీడియో ఆడియోలతో ఈ పాఠాలు ఉండనున్నాయి.
- 15000 రూపాయలు విలవ చేసే కంటెంట్ ను లోడ్ చేసి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- తెలుగు, ఇంగ్లీష్ సహా 8 భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులో ఉంచనున్నారు.
- 8 వ తరగతి విద్యార్థులు CBSE విధానంలో పరీక్షలు రాసేలా కంటెంట్.
- ఇంటి వద్ద కూడా సులభంగా చదువుకునేలా వెసులుబాటు
Leave a Reply