ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 1 నుంచి వేసవి సెలువులు ప్రారంభంకానున్నాయి
ఈ విద్యా సంవత్సరానికి గానూ చివరి పని దినంగా ఏప్రిల్ 30వ తేదీగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చివరి రోజు విద్యార్ధులు, తల్లిదండ్రులతో మీటింగ్ (పీటీఎం) నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది.
Leave a Reply