స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బసు పథకాన్ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దాదాపు అన్ని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అధికారిక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
ఉచిత బస్ పథకం మార్గదర్శకాలు ఇవే
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించే స్త్రీ శక్తి పథకాన్ని మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15న ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటి?
- మహిళల ఆర్థిక భారం తగ్గించటం
- విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్య సేవల కోసం వారు సులభంగా ప్రయాణించగలగడం
- గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపరచడం
- మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం
ఏ ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం?
రాష్ట్రవ్యాప్తంగా 8,458 APSRTC బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. ఇందులోని బస్సులు:
- పల్లె వెలుగు
- అర్బన్ వెలుగు
- మెట్రో ఎక్స్‌ప్రెస్
- సిటీ ఆర్డినరీ
- ఎక్స్‌ప్రెస్ బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం బస్సులలో 74% ఉచిత బస్సు పథకానికి వినియోగించడం గమనార్హం.
ఎక్కడెక్కడ ఈ పథకం అమలు?
ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలులోకి వస్తుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్నిటిలోనూ ఈ ప్రయాణ సౌకర్యం లభించనుంది. ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగస్తులు మరియు వ్యాపార నిర్వహణలో ఉన్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
అయితే ఈ పథకం మాత్రం ఇంటర్ స్టేట్ అనగా రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ఎక్స్ప్రెస్ బస్సులలో వర్తించదు.
ప్రయాణం ఎలా పొందాలి?
ప్రయాణ సమయంలో మహిళలు:
- గవర్నమెంట్ గుర్తింపు కార్డు చూపించాలి. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ఈ మూడింటిలో ఏదో ఒకటి చూపించి ప్రయాణించవచ్చు.
- ఉచిత టికెట్ పేరుతో ప్రభుత్వం జీరో టికెట్ ను జారీ చేస్తుంది.
ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు
- రోజువారీ రవాణా ఖర్చు తగ్గుతుంది
- గ్రామీణ మహిళలకు మెరుగైన అవకాశాలు
- విద్యార్థినులకు ప్రయాణ భారం తగ్గుతుంది
- మహిళా శక్తి మరియు భద్రతకు ప్రోత్సాహం
- పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
‘శ్రీ శక్తి’ పథకాన్ని మంగళగిరి నుంచి ఆగస్టు 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచ్ రంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలు మరో ఆగస్టు 12 లోపు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply