ఈఎస్ఐ వైద్య సేవల కు సంబంధించి ఈఎస్ఐ చట్టం కి లోబడి అర్హత ఉన్న చిన్న చిన్న ఉద్యోగ సంస్థలు, యాజమాన్యాలు ఇప్పటికీ వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనివలన చిన్న స్థాయి ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వీరందరినీ ప్రేరేపించి ఈఎస్ఐ నెట్వర్క్ హాస్పిటల్స్ కి సంబంధించి తమ ఎంప్లాయిస్ ని నమోదు చేసేందుకు గాను ‘Scheme to promote registration of Employers/Employees’ SPREE 2025 క్యాంపెయిన్ పథకానికి పలు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.
ఈ మేరకు విజయవాడ ప్రాంతీయ డైరెక్టర్ మరియు హైదరాబాద్ శాంతినగర్ డైరెక్టర్ విడివిడిగా ప్రకటనలు జారీ చేశారు.
ESI లో నమోదైతే మెరుగైన వైద్య సేవలు
ఈఎస్ఐ చట్టం కింద ఏదైనా సంస్థ 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయిస్ ని కలిగి ఉండి, ఆ ఉద్యోగుల నెలవారి వేతనం 21,000 మరియు ఆలోపు గాని ఉంటే తప్పకుండా ఈఎస్ఐ వైద్య సేవలు కొరకు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
అలా చేయని పక్షంలో ఉద్యోగులు తమ పొందే వైద్య హక్కులను కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని విజయవాడ మరియు హైదరాబాద్ ఈఎస్ఐ ప్రాంతీయ డైరెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ విధంగా ఒకవేళ పట్టుబడితే గతంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా వసూలు చేస్తామని పేర్కొన్నారు.
అదే స్వచ్ఛందంగా యాజమాన్యాలు ఇప్పటికైనా ముందుకు వస్తే ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ ఎంప్లాయిస్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా ఇక ముందట ఆ ఎంప్లాయిస్ అందరికీ ఈఎస్ఐ వైద్య సేవలు పొందే వెసులు పాటు ఉంటుంది. అయితే క్రమం తప్పకుండా ఈఎస్ఐ చట్టం కింద వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈఎస్ఐ చట్టం కింద యాజమాన్యాలు తమ ఎంప్లాయిస్ ని రిజిస్టర్ చేస్తే క్రమంలో కొంత అమౌంట్ ఎంప్లాయిస్ నుంచి కొంత అమౌంట్ తాము కలిపి ఈఎస్ఐకి కట్టడం జరుగుతుంది. దీని ద్వారా ఎంప్లాయిస్ లేదా వారి కుటుంబంలో ఎవరికైనా సరే ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది.
స్ప్రీ కింద ఎప్పటి లోపు రిజిస్టర్ చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చా
జూలై 1 నుంచి డిసెంబర్ 31 2025 లోపు యాజమాన్యాలు తమ ఎంప్లాయిస్ ని ఈ పథకం కింద రిజిస్టర్ చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా ESIC portal, Shram Suvidha and MCA portal లో రిజిస్టర్ చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి
Leave a Reply