రాష్ట్రవ్యాప్తంగా 211 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అమల్లోకి వచ్చింది.
మిగిలిన 85 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
IGRS వెబ్సైట్ ద్వారా స్లాట్ తీసుకుని దస్తావేజుల రిజిస్ట్రేషన్కు కార్యాలయాలకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల క్రయవిక్రేతలు, సాక్షులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం తప్పింది.
ప్రయోగాత్మకంగా తొలుత ఈ విధానాన్ని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలు కనిపించడంలో మలి విడతలో జిల్లాకేంద్రాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం

Leave a Reply