గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

గుడ్ న్యూస్, దూదేకులకు షాదీ తోఫా వర్తింపు, ఆర్థిక సహాయం లక్ష కు పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నటువంటి షాదీతోఫా పథకాన్ని ఇకపై ముస్లింలోని ఇతర వెనకబడిన కులాలకు వర్తింప చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

దూదేకుల వారికి షాది తోఫా వర్తింపచేస్తూ నిర్ణయం

ముస్లిమ్స్ లో వెనుకబడినటువంటి తరగతులైనటువంటి దూదేకుల, నూర్ భాషా, లాద్దాఫ్ , పింజారీ వంటి కులాలకు కూడా షాది తోఫాను వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దూదేకుల లేదా నూరు భాషా కులం వారు అటు హిందూ మరియు ముస్లిం మతాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఏ పథకం కింద అమౌంట్ ఇవ్వాలనే దానిపైన కొంత సందిగ్తత నెలకొనగా దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వీరికి కూడా షాది తోఫా పరిధిలోనే ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయం తో సహాయం లక్ష రూపాయలకు పెంపు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 50 వేల రూపాయలు ముస్లిం మైనారిటీలకు లక్ష రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. దూదేకుల లేదా నూర్ భాషా కులానికి సంబంధించిన వారు బీసీ బీ పరిధిలోకి వస్తారు. అయితే ఇక పై వీరికి కూడా మైనారిటీలతోపాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

Shaadi tohfa to dudekula

షాది తోఫా పథకానికి సంబంధించి అన్ని లింక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to Share

You cannot copy content of this page