నిరుపేద మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే రెండో దశ పంపిణీని ప్రారంభించనుంది.
ఇందుకోసం రూ.153 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి.. రెండో దశ పంపిణీని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తొలి దశలో 10వేల మందికి ఆగస్టు 19న రూ.లక్ష చొప్పున అందించిన సంగతి తెలిసిందే.
Minority Bandhu second phase to begin shortly
మైనారిటీ బంధు పూర్తి వివరాలు
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు లక్ష పథకం మాదిరిగా మైనార్టీలకు లక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సబంధించి ఉత్తర్వులు జారీచేసింది.
మైనార్టీలకు ₹లక్ష సాయానికి సంబంధించి నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. AUG 14 చివరి తేదీ. ఇప్పటికే
ముస్లింల నుంచి దరఖాస్తులు స్వీకరించినందున వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ వెల్లడించారు. క్రిస్టియన్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21-55 ఏళ్ల వయసు, గ్రామాల్లో ₹1.50 లక్షలు, పట్టణాల్లో ₹2 లక్షల వార్షికాదాయం మించనివారు అర్హులు.]
మైనారిటీలకు లక్ష రూపాయలు, కండిషన్స్ ఇవే
మైనారిటీలకు లక్ష రూపాయల పథకం ద్వారా అర్హత పొందాలనుకునే వారికి కింద ఇవ్వబడిన అర్హతలు వర్తిస్తాయి.
- లబ్ధిదారుడు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
- జూలై 2 2023 నాటికి వయసు 21 నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి
- గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్ష ల వార్షిక ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి ఉంటుంది.
- ఒక కుటుంబంలో ఒకరి మాత్రమే ఇది వర్తిస్తుంది
- ముస్లిం మైనారిటీలకు మరియు క్రిస్టియన్ మైనారిటీ లకు ఈ పథకం వర్తిస్తుంది.
- 100% సబ్సిడీ తో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
ఈ పథకానికి సంబంధించి దశల వారీగా లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం జరుగుతుంది.
Official link for application & tracking: https://tsobmms.cgg.gov.in/
Leave a Reply