స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండి, సేవలో ఉన్నప్పటికీ, పదవీ విరమణ చేసిన తరువాత కూడా వారి కుటుంబాలకు మద్దతు అందించే విధంగా పలు పథకాలను అమలు చేస్తోంది. అలాగే కొత్తగా “SBI TRIBUTE” అనే పథకం ప్రవేశపెట్టింది.
🌟 పథక ఉద్దేశ్యం
పదవీ విరమణ పొందిన ఉద్యోగుల మరణించిన సమయంలో వారి కుటుంబానికి మానవీయతతో కూడిన ఆర్థిక సహాయం మరియు గౌరవంతో కూడిన పరామర్శ అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
📅 అమలులోకి వచ్చేది: 23 జూలై 2025 నుండి
🎯 అర్హతలు
- బ్యాంకు నుండి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు
- వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ద్వారా పదవీవిరమణ పొందిన వారు
- National Pension Scheme / PF Optiees (e-ABS): కనీసం 10 సంవత్సరాల సేవ పూర్తి చేసి 60 ఏళ్లు దాటిన వారు లేదా 20 సంవత్సరాల సేవ పూర్తి చేసి VRS తీసుకున్నవారు
💰 లబ్ధి వివరాలు
- పెరిగిన 72 గంటలలోపు తక్షణంగా రూ.30,000/- ఒక్కసారి చెల్లింపు.
- ఈ మొత్తం పెన్షనర్ జాయింట్ ఖాతా లేదా Next of Kin ఖాతాలో జమ చేయబడుతుంది.
📋 అవసరమైన పత్రాలు
- హాస్పిటల్ / డాక్టర్ ఇచ్చిన తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రం
- పెన్షనర్ / రిటైరీ ఐడెంటిటీ కార్డ్ / మెడిక్లెయిమ్ పాలసీ ID
- Next of Kin యొక్క గుర్తింపు ఆధారాలు
🏦 చెల్లింపు విధానం
- పెన్షన్ చెల్లించే బ్రాంచ్ లేదా రిటైర్మెంట్ బ్రాంచ్ – నోడల్ బ్రాంచ్ గా పని చేస్తుంది
- బ్రాంచ్ సస్పెన్స్ ఖాతా నుండి డెబిట్ చేసి చెల్లింపు
- Out of Circle లో మరణించినప్పుడు సమీప బ్రాంచ్ నుండి చెల్లింపు మరియు IBTS ద్వారా OADకి సమాచారం
🤝 వ్యక్తిగత పరామర్శ మరియు శ్రద్ధాంజలి
- HR మేనేజర్, బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి కుటుంబాన్ని పరామర్శించాలి
- స్థానిక భాషలో శ్రద్ధాంజలి లేఖ అందించాలి
🛠️ నోడల్ బ్రాంచ్ బాధ్యతలు
- HRMSలో మరణాన్ని అప్‌డేట్ చేయాలి
- పెన్షన్ చెల్లింపులు తక్షణం నిలిపివేయాలి
- ఫ్యామిలీ పెన్షన్ ప్రక్రియ ప్రారంభించాలి (అర్హత ఉన్నట్లయితే)
- మెడిక్లెయిమ్ పథకం కొనసాగింపు (REMBS – Policy A/B)
- హౌసింగ్ లోన్ తీర్చిదిద్దుట
- లాకర్, ఖాతాలు సంబంధిత మార్పులు చేయుట
📌 గమనిక
- ఈ పథకం కేవలం పదవీవిరమణ చేసిన ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది
- ఫ్యామిలీ పెన్షనర్ లేదా ఉద్యోగి భార్య/భర్త మరణించినప్పుడు వర్తించదు
Leave a Reply