స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు నేరుగా మరియు సులభంగా తమ బ్యాంకు శాఖ నుంచి అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది.
ఈ పథకాలకు నేరుగా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు
అర్హత ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఇకపై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హతను బట్టి నేరుగా బ్యాంక్ బ్రాంచ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందుకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్రాంచ్ లోని కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద ఈ సదుపాయాన్ని కల్పించింది.
ఎలా అప్లై చేయాలి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు తమ బ్రాంచ్ కి వెళ్లి ఆధార్ నెంబర్ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద ఇస్తే, వారి అర్హతను చెక్ చేయడం జరుగుతుంది.
వారి అర్హతల ఆధారంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలలో అక్కడి సిబ్బంది నమోదు చేస్తారు.
ఆధార్ తో పాటు మీ అకౌంట్ పాస్బుక్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏమిటి
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు తక్కువ ధరలతో బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
ఈ పథకానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు కింది లింక్ పై క్లిక్ చేయండి.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది.
ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి
అటల్ పెన్షన్ యోజన పథకం అంటే ఏమిటి?
అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందాలనుకునేవారు ఈ పథకంలో చేరవచ్చు. తాము చెల్లించే అమౌంట్ ను బట్టి వెయ్యి నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ పొందే సౌకర్యం ఈ పథకం ద్వారా కలదు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను కింది లింకు ద్వారా చెక్ చేయండి.
Leave a Reply