దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద డిపాజిట్ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపింది.. ఎస్బిఐ లోనే అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నటువంటి ప్రత్యేక డిపాజిట్ స్కీం “అమృత్ కలశ్ పథకం” గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
స్టేట్ బ్యాంక్ ద్వారా అత్యధిక వడ్డీ ఇచ్చే అమృత్ కలశ్ గడువు పెంపు
అమృత్ కలశ్ పథకం ద్వారా 400 రోజుల డిపాజిట్ పై 7.1% వడ్డీ, సీనియర్ సిటీజన్లకు అయితే 7.6% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ కి జూన్ 30తో గడువు ముగుస్తుండగా దీనిని ఆగస్టు 15 అనగా స్వాతంత్ర దినోత్సవం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా లేదా ఎస్బిఐ యూనో యాప్ ద్వారా కూడా లబ్ధిదారులు ఈ డిపాజిట్ స్కీంను తీసుకోవచ్చు. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ వడ్డీ పొందాలనుకునే వారికి ఈ పథకం చక్కటి అవకాశం గా చెప్పవచ్చు.
అమృత్ కలశ్ డిపాజిట్ పథకం పూర్తి వివరాలు
- ఈ పథకం కాల పరిమితి: 400 రోజులు
- ఈ పథకానికి చెల్లించే వడ్డీ సాధారణ పౌరులకు 7.1% సీనియర్ సిటిజన్లకు 7.6%
- గరిష్టంగా రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15 2023
- ఈ పథకానికి భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
- ఈ డిపాజిట్ ను ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది
- ఈ డిపాజిట్ పై రుణ సౌకర్యం కూడా లభిస్తుంది
- ఈ డిపాజిట్ స్కీమ్ తీసుకోవాలనుకునేవారు ఎస్బిఐ బ్రాంచ్ లో గాని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా గాని లేదా ఎస్బిఐ ఆప్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం తో పాటు సీనియర్ సిటిజన్ల కు అందిస్తున్న మరో పథకమైనటువంటి వికేర్ పథకం గడువును కూడా ఎస్బిఐ సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిష్టంగా ఏడు రోజులు నుంచి పదేళ్ల వరకు ఫిక్స్ డిపాజిట్ల ను అందిస్తుంది. సాధారణ పౌరులకు అయితే 7 శాతం వరకు వయోవృద్ధులకు అయితే 7.5% వరకు ఈ డిపాజిట్లపై వడ్డీని అందిస్తున్నారు. అయితే ఈ అమృత్ కలశ్ ప్రత్యేక పథకం ద్వారా అత్యధికంగా సీనియర్ సిటిజెన్లకు 7.6% సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది.
Leave a Reply