సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శుక్రవారం శాఖ అధికారులతో
సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఐర్ఎంఎస్ పోర్టల్లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు.

ఆన్లైన్ బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యే సమయానికి ముందే జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉంచనున్నారు.

వివిధ కేటగిరీల బదిలీలకు అనుమతి

కింది కేటగిరీల వారిగా బదిలీలకు అవకాశం కల్పించారు.

బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు ఒంటరి మహిళ ( Single Women) లేదా వితంతువులు (Widows), పలు ఆరోగ్య పరిస్థితులు (Certain Medical Cases), భార్య లేదా భర్త ( Spouse transfer) మరియు పరస్పర అంగీకారం తో Mutual ట్రాన్స్ఫర్ కు అవకాశం కల్పించగా, మిగిలిన కారణాలు ఏవైనా ఉంటే ఇతరులు (others) ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే మొదట నాలుగు కేటగిరీలు నింపిన తర్వాతే others ను పరిగణిస్తారు.

జిల్లా పరిధిలో బదిలీల ప్రక్రియ షెడ్యూల్

ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 3
జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది మే 28
ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ జూన్ 15
వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది జూన్ 15
తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడిజూన్ 15
బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు జూన్ 14,15
బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివరాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేదిజూన్ 14,15
బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీజూన్ 15

వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారి బదిలీల ప్రక్రియ షెడ్యూల్

జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేదిమే 28
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదిజూన్ 15
వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది
(ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండలం లేదా పట్టణం వివరాలు నమోదు)
జూన్ 15
బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీజూన్ 14,15
కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ జూన్ 14,15
బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేదిజూన్ 15
Click here to Share

One response to “సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు”

  1. Kavitha Rani.karlapudi Avatar
    Kavitha Rani.karlapudi

    I’m b pharmacy completed student I want to work in the govt job any chances please give me the job it’s my heartful request 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page