వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

వ్యవసాయ శాఖ పై కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు డబ్బులు జమ చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

రైతు భరోసా 2023 ఎప్పుడంటే ?

ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు నాటికి అనగా మే నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయాలని అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మే 10వ తేదీ నాటికి అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శించనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

వైఎస్ఆర్ రైతు భరోసా ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ 7,500 రూపాయలను మే నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 5,500 మరియు కేంద్ర వాటా రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా జమ చేస్తారు.

ఇక అర్హత ఉండి రైతు భరోసా కి ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు లేదా కొత్తవారు ఈ నెలాఖరు వరకు రైతు భరోసా కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది.

వ్యవసాయ సమీక్షలో భాగంగా యంత్ర సేవా పథకం పై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా కిసాన్‌ డ్రోన్లు పంపిణీ చేసేలా చూడాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు.

జూలై 2023 నాటికి 500 డ్రోన్లు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని డిసెంబర్ నాటికి 1500 పైగా డ్రోన్లను ఇచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Click here to Share

You cannot copy content of this page